చెప్పగవలె, కప్పురములు
కుప్పలుగ పోసినట్లు, కుంకమపైపై
గుప్పిన క్రియ, విరి పొట్లము
విప్పిన గతి, ఘమ్మనం గవిత్వము సభలన్.
— రఘునాధ నాయకుడి వాల్మీకి చరిత్రము
చెప్పగవలె, కప్పురములు
కుప్పలుగ పోసినట్లు, కుంకమపైపై
గుప్పిన క్రియ, విరి పొట్లము
విప్పిన గతి, ఘమ్మనం గవిత్వము సభలన్.
— రఘునాధ నాయకుడి వాల్మీకి చరిత్రము
బ్రాహ్మీదత్తవరప్రసాదుడ,ఉరుప్రజ్ఞావిశేషోదయా
జిహ్మస్వాంతుడ, వీశ్వరార్చనకళాశీలుండ, వభ్యర్హిత
బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్ధ నిర్ధారిత
బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు, నీ భాగ్యంబు సామాన్యమే!
– శృంగార నైషధము(శ్రీనాధ కవిసార్వభౌముడు)
gmail లో తరచుగా మనకు attachments పంపేటపుడు ఈ error వస్తుంది. దీని వలన మనకు mail పంపడము కష్టమవుతుంది. secured site వాడినట్టయితే మనకు mail పంపడము తేలికవుతుంది. క్రింది url మీద click చేసి తర్వాత దీనిని favourites కి add చేయండి.
ప్రతి సారి favourites ద్వారా gmail కి వెళ్లండి.
ఒక సారి ఈ లోకాన్ని చూడండి
ఈ లోకంలో జరిగే చిత్రాలు చూడండి
ఇక్కడ ఒళ్లమ్ముకొనే వేశ్యలుంటారు
అమ్ముడుపోయే వరుళ్ళు ఉంటారు
ఇక్కడ అర్ధరాత్రి వరకు త్రాగి తందనాలాడి
మధ్యాహ్నం ఏ పన్నెండింటికో
షూటింగుకు హాజరయ్యే
హీరో, హీరోయిన్లకు లక్షలకు లక్షలు
పారితోషికం లభిస్తుంది.
అయిదింటికే నిద్రలేచి
నిద్రలేమితోనే ఇంట్లో పనంతా చేసి
ఎనిమిదింటికే హడావిడి గా
పనిలోకెళ్ళే స్త్రీలకు
పాతిక రూపాయలు కూలి లభిస్తుంది.
ఇక్కడ తినడానికి తిండి లేని
నిర్భాగ్యులుంటారు
ఉండి తినలేని దౌర్భాగ్యులుంటారు
ఇక్కడ కారుల్లో తిరిగే
కుక్కలు కనిపిస్తాయి.
ఎంగిలి విస్తరాకుల మీద
ఎంగిలి మెతుకులు ఏరుకునే
పసి హృదయాలు కనిపిస్తాయి
ఇక్కడ మేధావి బిక్షమెత్తుకుంటాడు
మూర్ఖుడు కోట్లకు పడగలెత్తుతాడు
ఇక్కడ మనిషి దయ
దైవమై పూజలందుకొంటుంది
మనిషి మెదడు అణుబాంబుగా మారి
మొత్తం జీవకోటినే
భస్మీపటలం చేస్తుంది.
– నబి-రఫి నిషిద్దాక్షరాలు (2003)
ప్రకాశం జిల్లా రచయితల సంఘం
తెనుగే తీయని, దందు పద్య పదరీతి క్రీడ లత్యంత మో
హనముల్, శోభనముల్, తదీయ రస రక్తాలాపనంబుల్ లభిం
చిన, వాగర్ధ కలా కలాప జయలక్ష్మిన్ గాలికిం బుత్తునే?
జననీ! యేమిటి, కింక ఆశుకవితా సన్యాసమిప్పించవే!
–రాయప్రోలు సుబ్బారావు
కం// పలుకఁగ వలె నవ రసములు
గులుకం బద్యములు చెవులకున్ హృద్యముగా
నళుకక, యటుగాకున్నం
బలుకక యుండుటయే మేలు బహుమానముగన్.
— రఘునాధ రామాయణము
జయ జయ ప్రియ భారత
జనయిత్రీ, దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి
జయజయ సస్యామల సు
శ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా
చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా
//జయ జయ //
జయ దిశాంత గత వకుంత
దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక
గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ
చుంబిత సుందర చరణా
// జయ జయ //
– దేవులపల్లి కృష్ణ శాస్త్రి
శ్రీరామ దాస కృతి
రాగం సూర్యకాంతి, తాళం ఆది
పల్లవి
తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు
చరణం 1
ప్రక్కతోడుగ భగవంతుడు మన
చక్రధారియై చెంతనే ఉండగ
చరణం 2
మృచ్చు సోమకుని మును జంపిన ఆ..
మత్స్యమూర్తి మన పక్షమునుండగ
చరణం 3
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుడు మన వాడై ఉండగ
చరణం 4
దశగ్రీవు మును దండించిన ఆ…
దశరధ రాముని దయ మనకుండగ
చరణం 5
దుష్ట కంసుని దృంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతో నుండగ
చరణం 6
రామ దాసుని గాచెడి శ్రీ మన్నారాయణు
నెఱ నమ్మియుండగ
తెలుఁగదేలయన్న, దేశంబు దెలుఁ, గేను
దెలుఁగు వల్లభుండఁ,దెలుఁగొకండ
యెల్ల నృపులుఁ గొలువ నెఱుఁగవే బాసాడి?
దేశభాషలందుఁ దెలుగు లెస్స!
– అముక్తమాల్యద( శ్రీ కృష్ణ దేవరాయలు)
వాల్మీకము
అపి స్వర్ణమయీ లంకా, నమే లక్ష్మణ! రోచతే
జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ!!
ఇది వాల్మీకంగా ప్రసిద్ది పొందింది.
స్వర్ణమయమైన లంక కంటే జన్మభూమియే గొప్పదని భావించాడు శ్రీరాముడు.