అక్టోబర్ 15, 2007
భద్రాచల శ్రీరామ దాస కృతి
రాగము కళ్యాణి ఆది తాళము
నను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లీ!
నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి-
జనకుని కూఁతురా! జననీ జానకమ్మ\\ \\నను\\
ప్రక్కనుజేర్చుక – చెక్కిలి నొక్కుచుఁ
జక్కగ మరుకేళి సొక్కియుండెడి వేళ \\ \\నను\\
ఆద్రిజావినుతుఁడు – భద్రగిరీశుఁడు
నిద్రమేల్కొను వేళ – నెలఁతరో బోధించి \\ \\ నను \\
Leave a Comment » |
literature, భధ్రాచల శ్రీరామదాసు, శ్రీ రామదాసు, శ్రీరామదాసు |
శాశ్వత లింకు
mnareshkumar యొక్క టపా
అక్టోబర్ 11, 2007
శ్రీ రామ దాస కృతి
రాగము కాపీ; ఆది తాళము
చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి
వారధి గట్టిన వర భద్రాచల వరదా వరదా నీ దివ్య \\
ఆది శేష నన్నఱమర సేయకు
మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య \\ //చరణ//
వనమున ఱాతిని వనితగ జేసిన
చరణము శరణము నీ దివ్య \\ //చరణ//
బాగుగ నన్నేలు భద్రాచల రామ
దాసుఁడ దాసుఁడ దాసుఁడ నీ దివ్య \\ //చరణ//
Leave a Comment » |
literature, భధ్రాచల శ్రీరామదాసు, శ్రీ రామదాసు, శ్రీరామదాసు | Tagged: , bhadrachala, ramadasa, sri rama |
శాశ్వత లింకు
mnareshkumar యొక్క టపా
అక్టోబర్ 4, 2007
కం// పలుకఁగ వలె నవ రసములు
గులుకం బద్యములు చెవులకున్ హృద్యముగా
నళుకక, యటుగాకున్నం
బలుకక యుండుటయే మేలు బహుమానముగన్.
— రఘునాధ రామాయణము
Leave a Comment » |
literature, భధ్రాచల శ్రీరామదాసు, శ్రీ రామదాసు, శ్రీరామదాసు | Tagged: ragunaadha ramayana, rama, ramayana, telugu literature |
శాశ్వత లింకు
mnareshkumar యొక్క టపా
అక్టోబర్ 4, 2007
శ్రీరామ దాస కృతి
రాగం సూర్యకాంతి, తాళం ఆది
పల్లవి
తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు
చరణం 1
ప్రక్కతోడుగ భగవంతుడు మన
చక్రధారియై చెంతనే ఉండగ
చరణం 2
మృచ్చు సోమకుని మును జంపిన ఆ..
మత్స్యమూర్తి మన పక్షమునుండగ
చరణం 3
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుడు మన వాడై ఉండగ
చరణం 4
దశగ్రీవు మును దండించిన ఆ…
దశరధ రాముని దయ మనకుండగ
చరణం 5
దుష్ట కంసుని దృంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతో నుండగ
చరణం 6
రామ దాసుని గాచెడి శ్రీ మన్నారాయణు
నెఱ నమ్మియుండగ
Leave a Comment » |
literature, భధ్రాచల శ్రీరామదాసు, శ్రీ రామదాసు, శ్రీరామదాసు | Tagged: ramadasu, telugu literature |
శాశ్వత లింకు
mnareshkumar యొక్క టపా
అక్టోబర్ 3, 2007
వాల్మీకము
అపి స్వర్ణమయీ లంకా, నమే లక్ష్మణ! రోచతే
జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ!!
ఇది వాల్మీకంగా ప్రసిద్ది పొందింది.
స్వర్ణమయమైన లంక కంటే జన్మభూమియే గొప్పదని భావించాడు శ్రీరాముడు.
1 వ్యాఖ్య |
literature, భధ్రాచల శ్రీరామదాసు, శ్రీ రామదాసు, శ్రీరామదాసు | Tagged: ramayana. Sri rama, telugu literature, valmiki |
శాశ్వత లింకు
mnareshkumar యొక్క టపా
ఆగష్టు 29, 2007
శ్రీ రామ దాసకృతి
రాగం ఆనందభైరవి ,ఆది తాళం
పల్లవి
పలుకే బంగారమాయెనా కోదండ పాణి!
అనుపల్లవి
పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి
కలలొ నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ
చరణమ్1
యెంత వేడిన గాని శుంతైన దయ రాదు
పంతము చేయ నే నెంతటి వాడను తండ్రి
చరణమ్2
శరణా గత త్రాణ బిరుదాంకితుడవు గాద
కరుణించు భధ్రాఛల వర రామదాస పోషక
Sri Rama Dasa Kriti
Ragam : Ananda Byravi; Taalam : Adi
Pallavi
Paluke bangaramayenaa Kodanda pani!
Anupallavi
Paluke Bangaramaye pilichina palukavemi
Kalalo Nee Naamasmarana maruva Chakkani thandri
Charanam1
Yenta Vedina Gani Suntaina daya raadu
Panthamu cheya ne nenthati vaadanu thandri
Charanam2
Sarana gata thraana birudaankitudavu gaada
Karuninchu Bhadraachala vara Ramada Poshaka
Meaning
Sri rama dasa pleads with the Lord for talking to him. Inspite of ardent prayers, Sri Ramadasa observes that the Lord was not listening to his requests. This is one of the famous renditions of Sree Ramada and is sung by all particularly in the rural folk during Sri Navami Celebrations.
Pallavi : Oh! Rama! Is it that a word from your mouth is so precious and rare?
Anupallavi : why don’t you respond when I call you? I have never forgotten your thoughts even in my dreams.
Charanam:1 : You are not moved in spite of my repeated requests , prayers, entreating and beseeching . If you become stubborn, how can I bear as I am a puny creature. So please talk to me .
Charanam 2: You are well known to the universe that you are always the savior of the people who supplicate to you. So please show compassion on me
Leave a Comment » |
literature, భధ్రాచల శ్రీరామదాసు, శ్రీ రామదాసు, శ్రీరామదాసు | Tagged: bhadrachalam, ramadasu, srirama, telugu deivine lyrics, telugu literature |
శాశ్వత లింకు
mnareshkumar యొక్క టపా