శ్రీ కనకధారాస్తవము ఆది శంకరాచార్య విరచితము

మే 14, 2008

గణపతి ప్రార్ధన 
వన్దేవన్దారు మన్దార మిన్దిరానంద కందలమ్
అమన్దానంద సందోహ బన్దురం సింధురాననమ్
శ్రీ కనకధారాస్తవము

1. అఙ్గం హరే: పులక భూషణమాశ్రయ న్తీ
    భృ గాంగనేవ ముకుళాభరణం తమాలం
    అంగీకృతాఖిలవిభూతి రపాంగలీలా
    మాంగల్య2దాస్తు మమ మంగల దేవతాయా:

2. ముగ్ధా ముహుర్విదధతీ మురారే:
    ప్రేమత్రపా ప్రణీహితాని గతాగతాని,
    మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయా
    సామే శ్రియం దిశతు సాగరసమ్భవాయా:

3. విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్ష
   మానంద  హేతురధికం మురవిద్విషో2పి
   ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం
   ఇందీవరోదర సహోదర విందిరాయా:

4. ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
    మానంద కంద మనిమేష, మనంగ తంత్రం
    ఆకేకరస్ధిత కనినీక పద్మ నేత్రం
    భూత్మ్యై  భవే న్మమ భుజంగ శయనాయా:

5. కాలామ్భుదాళి లలితో రసి కైటభారే
    ర్దారాధరే స్పురతి  యా  తటి దంగనేవ
    మాతు సమస్త జగతాం మహనీయమూర్తి
   ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయా:

6. బాహ్వంతరే మురజిత: శ్రితకౌస్తు భే యా:
    హారావళీవ హరినీల మయీ విభాతి
   కామప్రదా భగవతో2పి కటాక్ష మాలా
   కల్యాణమావహతు మే కమలాలయాయా:

7. ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ర్పభావాత్
   మాంగల్య భాజి మధు మాధిని మన్నధేన
   మయ్యాపతే త్తదిహ మంధర మీక్షణార్ధం
   మన్దాలసం చ మకరాలయ కన్యకాయా:

8. దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబుధారా
    మస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే
    దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
    నారాయణ ప్రణయనీ నయనామ్బువాహ:

9. ఇష్టా2 విశిష్టమతయో2పి  య యా దయార్ధ
    దృష్టా స్ర్తివిష్టప పదం సులభం భజన్తే
    దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం
    పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయా:

10. గీర్దేవ తేతి గరుడధ్వజ   సుందరీతి
     శాంకభ రీతి శశి శేఖర వల్లభేతి
     సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
    తస్యైనమ స్ర్తిభువనైక గురో స్తరుణ్యై   

11.  శ్రుత్యై  నమో2స్తు శుభకర్మ  ఫల ప్రసూత్యై
      రత్యై  నమో2స్తు రమణీయ గుణార్ణవాయై
      శక్త్యై  నమో2స్తు శతపత్ర నికేతనాయై
     పుష్ట్యై  నమో2స్తు పురుషోత్తమ వల్లభాయై 

12. నమో2స్తు నాళీక నిభాననాయై
     నమో2స్తు దుగ్ఘోదధి జన్మ భూమ్యై
     నమో2స్తు  సోమామృత సోదరాయై
    నమో2స్తు నారాయణ వల్లభాయై

13. నమో2స్తు హేమాంభుజ పీఠికాయై
     నమో2స్తు  భు మండల నాయికాయై
     నమో2స్తు  దేవాది దయాపరాయై
     నమో2స్తు  శార్ఙ్గాయుధ వల్లభాయై

14. నమో2స్తు దేవ్యై భృగనందనాయై
      నమో2స్తు విషోణ రురసిస్థితాయై
      నమో2స్తు  లక్ష్మ్యే కమలాలయాయై
      నమో2స్తు దామోదర వల్లభాయై

15. నమో2స్తు కాన్త్యై కమలేక్షణాయై
      నమో2స్తు  భూత్యై భువన ప్రసూత్యై
      నమో2స్తు  దేవాదిభి రర్చితాయై
      నమో2స్తు  నందాత్మజ వల్లభాయై

16. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
      సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి
      త్వద్వందనాని దురితాహరణోద్యతాని
      మా మేవ మాత రనిశం కలయంతు మాన్యే 

17. యత్కటాక్ష సముపాసనా విధి:
      సేవకస్య సకలార్ధ సంపద :
      సంతనోతి వచనాంగమానసై
      స్త్వాం మురారి హృదమేశ్వరీం భజే 

18. సరసిజ నయనే! సరోజ హస్తే! 
      ధవళతరాంశుక గంధమాల్య శోభే !
      భగవతి ! హరి వల్లభే మనోజ్ఞే !
      త్రి భువన భూతికరి ! ప్రసీద మహ్యం

19. దిగ్ఘస్తిభి: కనకకుంభముఖావసృష్ట
      స్రగ్వాహినీ విమలచారు జలప్యుతాంగీం
      ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
     లోకాధినాధ గృహిణీ మమృతాబ్దిపుత్రీమ్

20. కమలే కమలాక్ష వల్లభే త్వం
      కనుణాపుర తరంగితై రపాంగై:
      అవలోకయ మా మకీంచనానాం
      ప్రధమం పాత్ర  మ కృత్రిమం దయాయా:

21. బిల్వాటవీ మధ్య లసత్సరోజే
      సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్
      అష్టా పదామ్బోరుహ పాణి పద్మాం
      సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ 

22. కమలాసన పాణినాలలాటే లిఖితా
      మక్షరపంక్తి మస్య జంతో:
      పరిమార్జయ మాత రంఘ్రిణా తే
      ధనికద్వార నివాస దు:ఖ దోగ్ధ్రీమ్

23. అంభోరుహం జన్మగృహం భవత్యా :
      వక్షస్తలం భర్తృ గృహం మురారే:
      కారుణ్యత: కల్పయ పద్మవాసే
      లీలాగృహం మే హృదయారవిందమ్

24. స్తవంతి యే స్తుతుభి రమూభిరస్వహం
     త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
     గుణాధికా గురుతర భాగ్య భాజినో
     భవంతి తే భువి బుధ భావితాశయా:

ఫలస్తుతి

సువర్ణధారా స్తోత్రం యశ్చంకరాచార్య నిర్మితం
త్రి సంధ్యం య: పఠేన్నిత్యం స కుభేర సమో భవేత్

 

 

 

 

 

 

 

 

 


నను బ్రోవుమని ….

అక్టోబర్ 15, 2007

                         భద్రాచల శ్రీరామ దాస కృతి

                         రాగము కళ్యాణి  ఆది తాళము

నను బ్రోవుమని చెప్పవే  సీతమ్మ తల్లీ!

నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి-

జనకుని కూఁతురా! జననీ జానకమ్మ\\                   \\నను\\

ప్రక్కనుజేర్చుక – చెక్కిలి నొక్కుచుఁ

జక్కగ మరుకేళి సొక్కియుండెడి వేళ \\                      \\నను\\  

ఆద్రిజావినుతుఁడు – భద్రగిరీశుఁడు

నిద్రమేల్కొను వేళ – నెలఁతరో బోధించి \\                       \\ నను \\


చరణములే నమ్మితి…..

అక్టోబర్ 11, 2007

                         శ్రీ రామ దాస కృతి

                      రాగము కాపీ; ఆది తాళము

చరణములే నమ్మితి  నీ దివ్య  చరణములే నమ్మితి

వారధి గట్టిన  వర భద్రాచల వరదా వరదా నీ దివ్య \\

 ఆది శేష నన్నఱమర సేయకు

మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య \\         //చరణ//

వనమున ఱాతిని వనితగ జేసిన

చరణము శరణము నీ దివ్య \\               //చరణ//

బాగుగ నన్నేలు  భద్రాచల రామ

దాసుఁడ దాసుఁడ దాసుఁడ నీ దివ్య \\      //చరణ//


చెప్పగవలె ….

అక్టోబర్ 8, 2007

చెప్పగవలె, కప్పురములు

కుప్పలుగ  పోసినట్లు, కుంకమపైపై

గుప్పిన క్రియ, విరి పొట్లము

విప్పిన గతి, ఘమ్మనం గవిత్వము సభలన్.  

                          — రఘునాధ నాయకుడి  వాల్మీకి చరిత్రము


శ్రీనాధ మహాకవి ….

అక్టోబర్ 8, 2007

బ్రాహ్మీదత్తవరప్రసాదుడ,ఉరుప్రజ్ఞావిశేషోదయా

జిహ్మస్వాంతుడ, వీశ్వరార్చనకళాశీలుండ, వభ్యర్హిత

బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్ధ నిర్ధారిత

బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు, నీ భాగ్యంబు సామాన్యమే!

                         –  శృంగార నైషధము(శ్రీనాధ కవిసార్వభౌముడు)


చూడు చూడు లోకం….

అక్టోబర్ 5, 2007

ఒక సారి ఈ లోకాన్ని చూడండి

ఈ లోకంలో జరిగే చిత్రాలు చూడండి

ఇక్కడ ఒళ్లమ్ముకొనే వేశ్యలుంటారు

అమ్ముడుపోయే వరుళ్ళు ఉంటారు

ఇక్కడ అర్ధరాత్రి వరకు త్రాగి తందనాలాడి

మధ్యాహ్నం ఏ పన్నెండింటికో

షూటింగుకు హాజరయ్యే

హీరో, హీరోయిన్లకు లక్షలకు లక్షలు

పారితోషికం లభిస్తుంది.

అయిదింటికే నిద్రలేచి

నిద్రలేమితోనే ఇంట్లో పనంతా చేసి

ఎనిమిదింటికే హడావిడి గా

పనిలోకెళ్ళే స్త్రీలకు

పాతిక రూపాయలు కూలి లభిస్తుంది.

ఇక్కడ తినడానికి తిండి లేని

నిర్భాగ్యులుంటారు

ఉండి తినలేని దౌర్భాగ్యులుంటారు

ఇక్కడ కారుల్లో తిరిగే

కుక్కలు కనిపిస్తాయి.

ఎంగిలి విస్తరాకుల మీద

ఎంగిలి మెతుకులు ఏరుకునే

పసి హృదయాలు కనిపిస్తాయి

ఇక్కడ మేధావి బిక్షమెత్తుకుంటాడు

మూర్ఖుడు కోట్లకు పడగలెత్తుతాడు

ఇక్కడ మనిషి దయ

దైవమై పూజలందుకొంటుంది

మనిషి మెదడు అణుబాంబుగా మారి

మొత్తం జీవకోటినే

భస్మీపటలం చేస్తుంది.

                   –  నబి-రఫి నిషిద్దాక్షరాలు (2003)

                         ప్రకాశం జిల్లా  రచయితల సంఘం


తెనుగే తీయని…

అక్టోబర్ 4, 2007

తెనుగే తీయని, దందు పద్య పదరీతి క్రీడ లత్యంత మో

హనముల్, శోభనముల్, తదీయ రస రక్తాలాపనంబుల్ లభిం

చిన, వాగర్ధ కలా కలాప జయలక్ష్మిన్ గాలికిం బుత్తునే?

జననీ! యేమిటి, కింక ఆశుకవితా సన్యాసమిప్పించవే!  

                                             –రాయప్రోలు సుబ్బారావు 


పలుకగ వలె…

అక్టోబర్ 4, 2007

కం//      పలుకఁగ వలె నవ రసములు

           గులుకం బద్యములు చెవులకున్ హృద్యముగా

           నళుకక, యటుగాకున్నం

           బలుకక యుండుటయే మేలు బహుమానముగన్.

                                                   — రఘునాధ రామాయణము


జయ జయప్రియ భారత…

అక్టోబర్ 4, 2007

జయ జయ ప్రియ భారత

జనయిత్రీ, దివ్యధాత్రి

జయ జయ జయ శత సహస్ర

నర నారీ హృదయనేత్రి

జయజయ సస్యామల సు

శ్యామ చలచ్చేలాంచల

జయ వసంత కుసుమలతా

చరిత లలిత చూర్ణకుంతల

జయ మదీయ హృదయాశయ

లాక్షారుణ పదయుగళా

                            //జయ జయ //

జయ దిశాంత గత వకుంత

దివ్యగాన పరితోషణ

జయ గాయక వైతాళిక

గళ విశాల పద విహరణ

జయ మదీయ మధురగేయ

చుంబిత సుందర చరణా

                                 // జయ జయ //

                                                             –  దేవులపల్లి కృష్ణ శాస్త్రి


తక్కువేమి మనకు…

అక్టోబర్ 4, 2007

               శ్రీరామ దాస కృతి

       రాగం సూర్యకాంతి, తాళం ఆది

పల్లవి

తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు

చరణం  1

ప్రక్కతోడుగ భగవంతుడు మన

చక్రధారియై చెంతనే ఉండగ

చరణం  2

మృచ్చు సోమకుని మును జంపిన ఆ..

మత్స్యమూర్తి మన పక్షమునుండగ

చరణం  3

భూమి స్వర్గమును పొందుగ గొలిచిన

వామనుడు మన వాడై ఉండగ

చరణం   4

దశగ్రీవు మును దండించిన ఆ…

దశరధ రాముని దయ మనకుండగ

చరణం   5

దుష్ట కంసుని దృంచినట్టి శ్రీ

కృష్ణుడు మనపై కృపతో నుండగ

చరణం   6

రామ దాసుని గాచెడి శ్రీ మన్నారాయణు

నెఱ నమ్మియుండగ