ఒక సారి ఈ లోకాన్ని చూడండి
ఈ లోకంలో జరిగే చిత్రాలు చూడండి
ఇక్కడ ఒళ్లమ్ముకొనే వేశ్యలుంటారు
అమ్ముడుపోయే వరుళ్ళు ఉంటారు
ఇక్కడ అర్ధరాత్రి వరకు త్రాగి తందనాలాడి
మధ్యాహ్నం ఏ పన్నెండింటికో
షూటింగుకు హాజరయ్యే
హీరో, హీరోయిన్లకు లక్షలకు లక్షలు
పారితోషికం లభిస్తుంది.
అయిదింటికే నిద్రలేచి
నిద్రలేమితోనే ఇంట్లో పనంతా చేసి
ఎనిమిదింటికే హడావిడి గా
పనిలోకెళ్ళే స్త్రీలకు
పాతిక రూపాయలు కూలి లభిస్తుంది.
ఇక్కడ తినడానికి తిండి లేని
నిర్భాగ్యులుంటారు
ఉండి తినలేని దౌర్భాగ్యులుంటారు
ఇక్కడ కారుల్లో తిరిగే
కుక్కలు కనిపిస్తాయి.
ఎంగిలి విస్తరాకుల మీద
ఎంగిలి మెతుకులు ఏరుకునే
పసి హృదయాలు కనిపిస్తాయి
ఇక్కడ మేధావి బిక్షమెత్తుకుంటాడు
మూర్ఖుడు కోట్లకు పడగలెత్తుతాడు
ఇక్కడ మనిషి దయ
దైవమై పూజలందుకొంటుంది
మనిషి మెదడు అణుబాంబుగా మారి
మొత్తం జీవకోటినే
భస్మీపటలం చేస్తుంది.
– నబి-రఫి నిషిద్దాక్షరాలు (2003)
ప్రకాశం జిల్లా రచయితల సంఘం
6:18 అపరాహ్నం వద్ద అక్టోబర్ 26, 2007 |
very good keepitup!