పలుకే బంగారమాయెనా…..

శ్రీ రామ దాసకృతి

రాగం ఆనందభైరవి ,ఆది తాళం

పల్లవి 

పలుకే బంగారమాయెనా  కోదండ పాణి!

అనుపల్లవి

పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి
కలలొ నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ

చరణమ్1
యెంత వేడిన  గాని శుంతైన దయ రాదు
పంతము చేయ నే నెంతటి వాడను తండ్రి

చరణమ్2
శరణా గత త్రాణ బిరుదాంకితుడవు గాద
కరుణించు భధ్రాఛల వర రామదాస పోషక

ప్రత్యుత్తరమిమ్ము