work from home
అక్టోబర్ 19, 2010శ్రీ కనకధారాస్తవము ఆది శంకరాచార్య విరచితము
మే 14, 2008గణపతి ప్రార్ధన
వన్దేవన్దారు మన్దార మిన్దిరానంద కందలమ్
అమన్దానంద సందోహ బన్దురం సింధురాననమ్
శ్రీ కనకధారాస్తవము
1. అఙ్గం హరే: పులక భూషణమాశ్రయ న్తీ
భృ గాంగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిలవిభూతి రపాంగలీలా
మాంగల్య2దాస్తు మమ మంగల దేవతాయా:
2. ముగ్ధా ముహుర్విదధతీ మురారే:
ప్రేమత్రపా ప్రణీహితాని గతాగతాని,
మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయా
సామే శ్రియం దిశతు సాగరసమ్భవాయా:
3. విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్ష
మానంద హేతురధికం మురవిద్విషో2పి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం
ఇందీవరోదర సహోదర విందిరాయా:
4. ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానంద కంద మనిమేష, మనంగ తంత్రం
ఆకేకరస్ధిత కనినీక పద్మ నేత్రం
భూత్మ్యై భవే న్మమ భుజంగ శయనాయా:
5. కాలామ్భుదాళి లలితో రసి కైటభారే
ర్దారాధరే స్పురతి యా తటి దంగనేవ
మాతు సమస్త జగతాం మహనీయమూర్తి
ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయా:
6. బాహ్వంతరే మురజిత: శ్రితకౌస్తు భే యా:
హారావళీవ హరినీల మయీ విభాతి
కామప్రదా భగవతో2పి కటాక్ష మాలా
కల్యాణమావహతు మే కమలాలయాయా:
7. ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ర్పభావాత్
మాంగల్య భాజి మధు మాధిని మన్నధేన
మయ్యాపతే త్తదిహ మంధర మీక్షణార్ధం
మన్దాలసం చ మకరాలయ కన్యకాయా:
8. దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయనీ నయనామ్బువాహ:
9. ఇష్టా2 విశిష్టమతయో2పి య యా దయార్ధ
దృష్టా స్ర్తివిష్టప పదం సులభం భజన్తే
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయా:
10. గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాంకభ రీతి శశి శేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యైనమ స్ర్తిభువనైక గురో స్తరుణ్యై
11. శ్రుత్యై నమో2స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై
రత్యై నమో2స్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యై నమో2స్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో2స్తు పురుషోత్తమ వల్లభాయై
12. నమో2స్తు నాళీక నిభాననాయై
నమో2స్తు దుగ్ఘోదధి జన్మ భూమ్యై
నమో2స్తు సోమామృత సోదరాయై
నమో2స్తు నారాయణ వల్లభాయై
13. నమో2స్తు హేమాంభుజ పీఠికాయై
నమో2స్తు భు మండల నాయికాయై
నమో2స్తు దేవాది దయాపరాయై
నమో2స్తు శార్ఙ్గాయుధ వల్లభాయై
14. నమో2స్తు దేవ్యై భృగనందనాయై
నమో2స్తు విషోణ రురసిస్థితాయై
నమో2స్తు లక్ష్మ్యే కమలాలయాయై
నమో2స్తు దామోదర వల్లభాయై
15. నమో2స్తు కాన్త్యై కమలేక్షణాయై
నమో2స్తు భూత్యై భువన ప్రసూత్యై
నమో2స్తు దేవాదిభి రర్చితాయై
నమో2స్తు నందాత్మజ వల్లభాయై
16. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మా మేవ మాత రనిశం కలయంతు మాన్యే
17. యత్కటాక్ష సముపాసనా విధి:
సేవకస్య సకలార్ధ సంపద :
సంతనోతి వచనాంగమానసై
స్త్వాం మురారి హృదమేశ్వరీం భజే
18. సరసిజ నయనే! సరోజ హస్తే!
ధవళతరాంశుక గంధమాల్య శోభే !
భగవతి ! హరి వల్లభే మనోజ్ఞే !
త్రి భువన భూతికరి ! ప్రసీద మహ్యం
19. దిగ్ఘస్తిభి: కనకకుంభముఖావసృష్ట
స్రగ్వాహినీ విమలచారు జలప్యుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాధ గృహిణీ మమృతాబ్దిపుత్రీమ్
20. కమలే కమలాక్ష వల్లభే త్వం
కనుణాపుర తరంగితై రపాంగై:
అవలోకయ మా మకీంచనానాం
ప్రధమం పాత్ర మ కృత్రిమం దయాయా:
21. బిల్వాటవీ మధ్య లసత్సరోజే
సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్
అష్టా పదామ్బోరుహ పాణి పద్మాం
సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్
22. కమలాసన పాణినాలలాటే లిఖితా
మక్షరపంక్తి మస్య జంతో:
పరిమార్జయ మాత రంఘ్రిణా తే
ధనికద్వార నివాస దు:ఖ దోగ్ధ్రీమ్
23. అంభోరుహం జన్మగృహం భవత్యా :
వక్షస్తలం భర్తృ గృహం మురారే:
కారుణ్యత: కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదయారవిందమ్
24. స్తవంతి యే స్తుతుభి రమూభిరస్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్య భాజినో
భవంతి తే భువి బుధ భావితాశయా:
ఫలస్తుతి
సువర్ణధారా స్తోత్రం యశ్చంకరాచార్య నిర్మితం
త్రి సంధ్యం య: పఠేన్నిత్యం స కుభేర సమో భవేత్
9power 9th power to 9 విలువ గురించిన సమాచారం
ఏప్రియల్ 30, 2008999
విలువ ఎంత ఉంటుందో ఊహిచగలరా ఈ సంఖ్య లో ఎన్ని అంకెలు ఉంటాయో తెలుసా
99
విలువ 387420489 అంటే
999 = 9387420489
387420489
= 387420474 + 15
= 21 X 18448594 + 15
921 విలువ 21 అంకెలలో ఉంటుంది.
942 విలువ 41 అంకెలలో ఉంటుంది. 1 తగ్గుతుంది
963 విలువ 61 అంకెలలో ఉంటుంది. 2 తగ్గుతుంది అంటే
921 x 3 విలువ 61 అంకెలలో ఉంటుంది. 2 అంకెలు తగ్గుతాయి.
921 x 4 విలువ 81 అంకెలలో ఉంటుంది. 3 అంకెలు తగ్గుతాయి.
921 x 5 విలువ 101 అంకెలలో ఉంటుంది. 4 అంకెలు తగ్గుతాయి.
…………………………………………………………………..
…………………………………………………………………..
921 x n విలువ n-1 అంకెలు తగ్గుతాయి. అలాగే
921 x 18448594 18448593 అంకెలు తగ్గుతాయి.
= 9387420474 387420474 కి 18448593 అంకెలు తగ్గుతాయి.
= 9387420489 387420489 కి 18448593 అంకెలు తగ్గుతాయి
అంటే ఈ సంఖ్యలో ఖచ్చితంగా 387420489 – 18448593 అంకెలుంటాయి.
= 368,971,896 అంకెలు గల సంఖ్య అవుతుంది.
సమీప భవిష్యత్ లో ఈ సంఖ్య మొత్తాన్ని కనుగొనాలి.
శ్రీనివాస రామానుజం హార్డీకి వ్రాసిన మొదటి లేఖ
ఫిబ్రవరి 27, 2008Ramanujan, the great Indian mathematician began correspondence with G H Hardy, the Fellow of Trinity College. His first letter to Hardy, dated January 16, 1913 goes as follows
“Dear Sir,
“ I beg to introduce my self to you as a clerk in the Accounts Department of the Port Trust Office at Madras on a salary of 20$ per annum. I am now at 23 years of age . I have had no university education but I have undergone the ordinary School course. After leaving school I have been employing the spare time at my disposal to work at mathematics. I have not trodden through the conventional regular course which is followed in a University course, but I am striking out a new path for my self. I have made a special investigation of divergent series in general and the results I get are termed by the local mathematicians as ‘starling’ …
I would request you to go through the enclosed papers. Being poor, if you are convinced that there is any thing of value I would like to have my theorems published. I have not given the actual investigations nor the expressions that I get but I have indicated the lines on which I proceed. Being inexperienced I would very highly value any advice you give me. Requesting to be excused for the trouble I give you.
I remain, Dear Sir, Yours Truly,
S. RAMANUJAN
To the letter attached was 120 theorems.
Ramanujan used to say that goddess Namagiri the goodess of Namakkal inspired him with the formulae in dreams. It is remarkable fact that on rising from bed he would frequently note down the results and verify them. This pattern repeated itself through out his Life.
యువకులారా లేవండి మేల్కొనండి
డిసెంబరు 29, 2007భారత యువకులారా!
భావి భారత భాగ్యోదయం మీ మీదనే ఆధారపడి ఉన్నది. నా ఆశలన్నీ మీ పైనే ఉన్నాయి. మీ జాతి పిలుపు నందుకుంటారా. మీరు సాహసిస్తే మీలో ప్రతి ఒక్కరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంది. నా మాట నమ్మండి. ప్రతి ఆత్మలోనూ అనంత శక్తి ఇమిడి ఉన్నదనే ధృఢ నమ్మకం మీలో ఉంటే మీరు ఈ భారత దేశాన్ని పునర్నింర్మించ గలరు. మీ భవిష్యత్తు నిర్ణయించు కోవాల్సిన సమయ మిదే స్వచ్ఛంగా ఉజ్వలంగా పొంగి పొర్లే యువ శక్తి మీలో ఉండగానే నిశ్చయుంచుకోండి. మీ ఓపిక ఉడిగాక కాదు.
నాయనలారా ! లేవండి నిద్ర మేల్కొనండి. ధీరులు కండి! భయపడకండి. మనం నిర్భయులంకావాలి. అపుడే మన ఉద్యమం విజయవంతం అవుతుంది. మన దేశానికి మహత్తర త్యాగం అవసరం. ఇందుకు యువకులే పూనుకోవాలి.
ధీరులారా! మీరందరూ ఘనకార్యాల్ని సాధించేందుకు జన్మించామనే నమ్మకం కలిగి ఉండండి. కుక్క పిల్లల అరుపులకి జడవకండి. అంతే కాదు ఆకాశం నుండి విరిగి పడే పిడుగులకైనా మీరు చలించకండి.
విద్యావంతులు, శక్తిమంతులు, బలిష్టులు, కండ పుష్టి గల యువకులకే ఈ మహాకార్యం నిర్దేశించి ఉంది. ఇలాంటి యువకులు వందలకొద్దీ, వేలకొద్దీ మనకి ఉన్నారు. మన మాతృభూమి మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తున్నది. నిరుపేదలమని, నిస్సహాయులమనీ, వెనుకాడకండి. ఉత్తేజంతో ఉత్సాహంతో ముందుకి ఉరకండి.
మన మాతృదేశానికి వీరులు కావాలి. ధీరులు కావాలి. జాతీయ రక్తనాళాల్లో కొత్త శక్తిని రగిల్చే విద్యుత్తేజం మహోత్సాహం కావాలి. నా బిడ్డలు పిరికి వాళ్ళు కారాదు.
ఇనుప కండలు, ఉక్కునరాలు, వజ్ర కఠినపు మనస్సు, బ్రహ్మతేజం , క్షాత్ర వీర్యం ! నాయనలారా ఇవే మనకు కావాలి. శారీరకంగా , మానసికంగా, అధ్యాత్మికంగా మిమల్ని కృంగదీసే ఏ విషయాన్నైనా సరే విషం లా విసిరి కొట్టండి. పవిత్రంగా, నిస్వార్ధంగా మీరుండాలి. నిస్వార్ధమే నీతి, స్వార్ధమే అవినీతి.
ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు సోమరులు గా గడపటం చూసి నాకెంతో భాధ గా ఉంది. మీ చదువులు పూర్తి కాగానే పరుల సేవలో మీరు నిమగ్నులు కండి. అప్పుడు మీకు వజ్ర వైడూర్యములు నిధి నిక్షేపాలు లభించినప్పటికన్నా ఎక్కవ ఆనందం కలుగుతుంది. లేవండి! ఎన్నాళ్ళు ఇలా పడి ఉంటారు? ఈ లోకంలో పుట్టినందుకి గుర్తుగా ఏదో ఒక మంచి పని చేసి పొండి. లేకంటే మీకూ, ఈ చెట్టు చేమలకీ , రాయి రప్పలకీ తేడా ఏమిటి ? అవీ పుట్టి గిట్టుతున్నాయి కదా!
కార్యభారం వహించండి, కార్యశూరున్ని పురుష సింహాన్ని విజయలక్ష్మి వరిస్తుంది. వెనక్కి చూడకండి, ముందజ వేయండి, అఖండ శక్తి, అఖండ దీక్ష, అఖండ సహనం కావాలి మనకి. అప్పుడే మహత్తర విజయాలు సాధించగలం.
పరోపకారమే పుణ్యం పరాపకారమే పాపం. మీ మనసు మాట, చేత వీటిని మీరు పరుల హితం కోసం వినియోగించాలి.
పవిత్ర హృదయులు, ప్రచంఢ దీక్షా దక్షులు భగద్విశ్వాస బలోపేతులు దరిద్రులపై, దీనులపై, అధః కృతులపై సానుభూతి కతన సింహసాహసాన్వితులు మోక్ష సందేశమును, సమత్వ సందేశమును భోధించుచు యావద్భారత దేశమును సంచరింప వలసి ఉన్నది.
పరహితార్ధము ఒక జీవితమునర్పింప జాలరా? వేదాంత శ్రవణము ధ్యానాది సాధనలు మున్నగు వానిని ముందు జన్మమునకు విడిచి పెట్టుడు!
లోక సేవకై శరీరమును ఆహుతి యొనర్చుడు! ఈ పేదలకై పరితపించి ఎవరి శరీరము వ్రీలి రక్తమయమగునో, వానిని నేను మహాత్ముడందును.
ఈ లకలాది జనులు విద్యాగంధము లేక, తినుటకు తిండి లేక దుఃఖ జీవనము గడుపుచుండ వారి మూలమున విద్యావంతుడయ్యును, వారి ప్రసక్తియే పెట్టుకొనకుండు వానిని నేను విశ్వాస ఘాతకుడు, ద్రోహి అందును.
ధీనులకు, పేదలకు, చదువు సందెలెరుగని రైతు బిడ్డలకు, కార్మికులకు, వీరి పురోభివృద్ధి నిమిత్తమే మన యుద్యమము. దరిద్రులు, దీనులు, అధఃకృతులు, అజ్ఞానులు, వీరే మీకారాధ్యులు కావలెను. సజీవ దైవమను, మానవ దైవమును ఆరాధింపుము. పర హితార్ధమగు సేవయే పరమ ధర్మము. ఈ రోజున కావలసినది చిత్తశుద్ది!
వలయునది కలహము కాదు, సహకారము. శతృత్వము కాదు, శాంతియుత సమన్వయము.
అంతః కలహములను బోనడచి జనులలో ఐకమత్యము ఒనగూర్చవలయును.
కండ బలముతో కాదు భారత దేశం లేచేది, ఆత్మ బలంతో మేల్కొంటుంది. విధ్వంస పతాకంతో కాదు, శాంతి ప్రేమ పతాకాలతో…..
శరీర శక్తి , భౌతిక శక్తి వలన గాక ఆత్మ శక్తి చేతనే భారత దేశం తరిస్తుంది. భౌతిక విజయ పతాకాన్ని కోరే వారు పామరులు. శాంతి ప్రేమల విజయం కోనే వారు ధన్యులు.
ప్రేమయందు గల శక్తి ద్వేషమందు గల శక్తి కన్న నెంతో ప్రభావవంతము.
ఒకే కులం, ఒకే వేదం, శాంతి సామరస్యము విరాజిల్లు సత్య యుగము రాబోవుతున్నదని నా విశ్వాసము.
…….. వత్సలారా! లెండు! లెండు!
మనకు విజయము సిద్ధము
నవీన భారతం
నాగలి చేతబూని రైతులు కుటీరాల నుంచి లేచి వచ్చు గాక !
చేపలు పట్టేవాళ్ళూ, చెప్పులు కుట్టేవాళ్ళు, వీధులు ఊడ్చే వాళ్ళు,
ఈ పామర జనం గుడిశెల నుండి లేచి వచ్చు గాక !
చిన్న చిన్న దుఖాణాలు, బజార్లు , సంతలు , కర్మాగారాల నుంచి వెలువడు గాక!
కొండలు , గుట్టలు, అడవులు, చెట్ల గుబురు, వాగుల నుండి ఉదయుంచు గాక!
స్వామి వివేకానంద
jan 12 జాతీయ యువజనోత్సవం సందర్భంగా (స్వామి వివేకానంద జయంతి )
దేశమును ప్రేమించుమన్నా….. గుఱజాడ
అక్టోబర్ 20, 2007దేశభక్తి
దేశమును ప్రేమించుమన్నా,
మంచి అన్నది పెంచుమన్నా
ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్,
గట్టి మేల్ తల పెట్టవోయ్
.
పాడి పంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటుపడవోయ్ ;
తిండి కలిగితే కండ కలదోయ్!
కండకల వాడేను మనిషోయ్!
.
ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్
.
అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్,
దేశి సరకుల నమ్మవలెనోయ్!
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్
.
వెనుక చూసిన కార్యమేమోయ్?
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుక పడితే వెనకేనోయ్
.
పూను స్పర్ధలు విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్
.
దేశాభిమానం నాకు కద్దని
ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్;
పూని ఏదైనా ఒకమేల్
కూర్చి జనులకు చూపవోయ్!
.
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చేసెనోయ్,
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్!
.
పరుల కలిమికి పొర్లియేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్?
ఒకరి మేల్ తనమేల నెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్!
.
స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్,
దేశమంటే మనుషులోయ్!
.
చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్ధులంతా నడువవలెనోయ్!
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవెనోయ్
.
మతం వేరైతేను యేమోయ్?
మనసులొకటై మనుషులుంటే
జాతి అన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్!
.
దేశమనెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్,
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్!
.
ఆకులందున అణగిమణగీ
కవిత కోయిల పలుక వలెనోయ్
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్!
మహాకవి గుఱజాడ వెంకట అప్పారావు గారు.

mnareshkumar యొక్క టపా 






